గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అనంతపురం రోడ్డులో మాతృశ్రీ హాస్పిటల్ వద్ద మున్సిపల్ అధికారులు డ్రైనేజీ కాలువ నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో డ్రైనేజీ కాలువలోని మురుగునీరు అంతా రోడ్డుపై ప్రవహిస్తున్నది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సోమవారం ప్రజలు కోరుతున్నారు.