ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించండి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.