బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి :పార్లమెంట్లో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Dec 3, 2025
ఏపీలోని బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని లోక్ సభలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి బుధవారం పేర్కొన్నారు. 2017లో సీఎం చంద్రబాబు నాయకత్వంలో శాసనసభ, మండలిలో కమిషన్ కూడా ఏర్పాటు చేసి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఏకగ్రీవ తీర్మానం జరిగిందని గుర్తుచేశారు. బిల్లును ప్రవేశపెట్టి న్యాయం చేయాలన్నారు.