తాడేపల్లిగూడెం: BSNL కార్యాలయంలో అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు, తప్పిన పెనుప్రమాదం.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని BSNL టెలీఫోన్ ఎక్స్చేంజి లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం కార్యాలయం వెనుక వైపు ఉన్న టెలిఫోన్ కాయిల్స్ కు షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు అంటుకుంది. వెంటనే గమనించిన సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎక్స్చేంజి చుట్టుప్రక్కల ఆసుపత్రులు, లాడ్జి, బ్యాంక్ లు ఉండడం తో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు..