బాల్కొండ: దారిదోపిడి నిందితులను అరెస్టు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కమ్మర్పల్లి పోలీసులు
కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామ శివారులో 16వ తేదీ సాయంత్రం దారి దోపిడీ జరిగింది,ఎస్సైఅనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కొమ్ము లక్ష్మీ నారాయణ హార్వెస్టర్ కొనుగోలు కొరకు మూడులక్షల 50 వేల రూపాయలతో భీంగల్ వెళ్తున్న సమయంలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి రెండు మొబైల్ లను మూడు లక్షల యాభై వేల నగదును ఎత్తుకెళ్లారు. అయితే హార్వెస్టర్ కొనడానికి వెళ్లిన వ్యక్తితో వెనకాల కూర్చున్న వ్యక్తే పథకం ప్రకారంఇద్దరు మిత్రులకు ఈవిషయం తెలిపి దారిదోపిడి చేయించాడని ఎస్సై అనిల్ రెడ్డితెలిపారు లక్ష్మీనారాయణ తనతోవచ్చిన జలంధర్ పై అనుమానం వ్యక్తం చేయడంతో ఆ కోణంలో దర్యాప్తు చేయగా అదే నిజం