రైతుల భూముల ఆన్లైన్ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ గడివేములలో సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ధర్నా
గడివేముల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల భూముల ఆన్లైన్ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు. మండల కార్యదర్శి S. అబ్దుల్ సలాం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, జిల్లా కార్యదర్శి పీక్కిలి వెంకటేశ్వర్లు తిరుపాడు, కోరటమద్ది, బూజనూరు, బిలకలగూడూరు, కొర్రపొలూరు, గని, ఎల్కే తండా సహా పలు గ్రామాల్లో భూముల ఆన్లైన్ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, రైతులు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా అధికారులు పరిష్కరించడం లేదని విమర్శించారు.