తాడిపత్రి నియోజకవర్గంలో సుమారు రూ.5 కోట్లు అవినీతి జరిగిందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ కు ఈ విషయంపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.తాడిపత్రి నియోజకవర్గంలో 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు మండల,జనరల్ ఫండ్స్ ను దోచుకున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో పీ పీ పీ మోడల్ అమలవుతున్నదన్నారు. పీ పీ పీ అంటే ప్రభాకర్ రెడ్డి,పోలీస్, ప్రైవేట్ లిమిటెడ్ అన్నారు.తన ఆరోపణలపై విచారణ చేసి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.