రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Dec 3, 2025
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుందని ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన సేవలు రైతు సేవా కేంద్రాల ద్వారా సమయానికి అందిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం మీకోసం రైతన్న కార్యక్రమంలో భాగంగా నంద్యాల రూరల్ మండలం పెద్ద కొట్టాల గ్రామ రైతు సేవ కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి రైతులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.