మహాశివరాత్రి పండుగ సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రముఖ దేవాలయాలు, శైవక్షేత్రాలు వద్ద నిర్వహించే తిరునాళ్ళు, రథోత్సవాలు, ఘాట్లు మరియు తీర ప్రాంతాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలియచేసారు. ప్రముఖ శివాలయాలకు దర్శనానికి, తిరునాళ్ల సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులు మరియు ప్రజలకు ఎటువంటి భద్రతా లేదా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక రూపొందించి, పార్కింగ్ ఏర్పాట్లు సమర్థవంతంగా అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలన్నారు.