పత్తికొండ: తుగ్గలి మండలంలో రోడ్డు ప్రమాదాలు నివారణకు డ్రైవర్లకు ఫేస్ వాష్ చేయించిన పోలీసులు
తుగ్గలి మండలంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఎస్సై బాలనరసింహులు ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని ఆదివారం అర్ధరాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా లారీలు, కార్లు, జీపులు, ట్రాలీలను ఆపి డ్రైవర్లకు నీటితో ముఖం కడిగించి, డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేశారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని, కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వాహనం నడపాలని, తద్వారా ప్రమాదాలను నివారించాలని డ్రైవర్లకు సూచనలు చేశారు.