రాజేంద్రనగర్: కాంగ్రెసు ప్రభుత్వంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు: ఫరూక్ నగర్ మండలంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం కర్ణంకుంట తండాలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా సంతోషంగతో తండావాసులు ఆయన స్టెప్పులు వేయించారు.