రెండు బైకులు ఢీ.. ఒకరికి సీరియస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలోకి వెళ్లే రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఒకదానినొకటి ఏడురేదురుగా ఢీ కొన్నాయి. సైదాపూర్ మండలంలోని ఏక్లాస్పూర్ గ్రామానికి చెందిన కుమార్ కేశవపట్నం నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. మొగిలిపాలెం గ్రామానికి చెందిన షేక్ మజీద్, షేక్ మన్సూర్ కేశవపట్నం వైపు వస్తుండగా వీరి బైక్, కుమార్ వాహనం పరస్పరం బలంగా శనివారం మద్య్హనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో షేక్ మజీద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు.కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.