కోడుమూరు: బి. తాండ్రపాడు గంగమ్మ చెరువు ఆక్రమణపై కోర్టు స్టే విధించడం పట్ల ప్రజల హర్షం
కోడుమూరు నియోజకవర్గంలోని బి తాండ్రపాడు పరిధిలో ఉన్న గంగమ్మ చెరువు అంశంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి చెరువును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో కబ్జా కోరులు చెరువులో 12 ఎకరాలను ఆక్రమించుకుని కంచె వేశారని తెలిపారు. దీంతో దివంగత మాజీ ఎంపీపీ రాజా వర్ధన్ రెడ్డి అప్పట్లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి పోరాటం సాగించారని గుర్తు చేశారు.