రాయదుర్గం: కణేకల్లులో ఘనంగా హిందూ సమ్మేళనం
కణేకల్లు మండల కేంద్రంలోని చిక్కణ్ణేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ లో హిందూ సమ్మేళనాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కమ్మరచేడు సంస్థానం పీఠాధిపతులు కల్యాణ స్వామిజీ, ఆర్ఎస్ఎస్ కార్యవాహ జి.లక్ష్మణ్ హాజరై మార్గ నిర్దేశం చేశారు. ముందుగా గోపూజ నిర్వహించారు. అనంతరం హిందూ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా భరతనాట్యం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సమాజం ఐక్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అయోధ్య రామిరెడ్డి, వేలూరు మరియప్ప రాఘవేంద్ర గుప్తా, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.