చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం, చేపల ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. గుమ్మగట్ట మండలం భైరవాణి తిప్ప ప్రాజెక్టులో శనివారం 10.40 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా గ్రామంలో మత్స్యకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రస్తుత ఎడాది రాష్ట్రవ్యాప్తంగా అనేక జలాశయాలు నీటితో కలకలాడుతున్నాయన్నారు.