చింతకాని: కల్వోడ్డులో వేడి నీటి కోసం హీటర్ ఆన్ చేసే క్రమంలో ఓ వ్యక్తి మృతి
వేడినీటి కోసం హీటర్ ఆన్ చేసే క్రమాన ఓ వ్యక్తి షాక్ కు గురై మృతి చెందాడు. సోమవారం ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలో దోనేపూడి మహేష్ బాబు(40) కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నాడు. ఆయన నీరు వేడి చేసేందుకు వాటర్ హీటర్ ఆన్ చేస్తూ షాక్ కు గురయ్యాడు. పక్కనే ఉన్న ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె భయంతో కేకలు వేస్తూ బయటకు వచ్చి తల్లికి చెప్పగా వారు మహేష్ ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు.