దుబ్బాక: అప్పనపల్లి గ్రామానికి చెందిన దూబాసి భాను(24) శనివారం బైక్ తో వడ్లకుప్పను డీ కొని మృతి
రోడ్డుపై వడ్లు పోసి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఇద్దరు రైతులపై సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లికి చెందిన దుబాసి భాను(24) శనివారం రాత్రి బైక్ పై అప్పనపల్లికి వెళ్తుండగా తోర్నాల గ్రామ శివారులో ఇద్దరు రైతులు ధాన్యం రోడ్డుపై పోసి, రాళ్లు పెట్టారు. ఆ కుప్పకు బైక్ ఢీ కొని రాళ్ల పై పడి మృతిచెందాడని.. దీనిపై రైతుల మీద కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట రూరల్ CI శ్రీను తెలిపారు.