ప్రొద్దుటూరు: బంగారు దుకాణం నిర్వాహకుడు తనికంటి శ్రీనివాసులు కిడ్నాప్ కలకలం
Proddatur, YSR | Nov 22, 2025 శుక్రవారం రాత్రి కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారు దుకాణం నిర్వాహకుడు కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక మెయిన్ బజార్లో బంగారు దుకాణం నిర్వహిస్తున్న తనికంటి శ్రీనివాసులు అనే వ్యాపారిని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి కిడ్నాప్ చేశారు. శ్రీనివాసులు రాత్రి 10 గంటల సమయంలో దుకాణం మూసివేసి తన భార్య లక్ష్మీ తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా శివాలయం సర్కిల్ లో ఇద్దరు వ్యక్తులు శ్రీనివాసులు వెళ్తున్న వాహనాన్ని ఆపి తాము పోలీసులమని ఎస్సై నిన్ను పిలుచుకు రమ్మన్నాడని చెప్పి శ్రీనివాసులు తమ కారులో కూర్చోబెట్టారు. శ్రీనివాసులు భార్య లక్ష్మీని తమ కారు వెంట రమ్మని చెప్పి