ముమ్మిడివరం, కాశివారి తూము పంటకాలువలో వృద్ధుడి మృతదేహం, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కాశివారి తూము పంటకాలువ లో స్థానికులు ఓ మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడు అదే ప్రాంతానికి చెందిన బొడ్డు సత్యనారాయణ (79)గా గుర్తించారు. పెరాలిసిస్ బాధితుడైన సత్యనారాయణ ప్రమాదవశాత్తూ కాల్వలో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు