ఆత్మకూరు డంపింగ్ యార్డ్ లో అగ్నిప్రమాదం, దట్టమైన పోగతో ఇబ్బందులు పడ్డ పట్టణవాసులు
ఆత్మకూరు పట్టణంలోని డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. వడ్ల రామాపురం వెళ్లే రహదారిలో ఉన్న డంపింగ్ యార్డుకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు.దీంతో మంటలు అమాంతం ఎగసిపడుతూ, దట్టమైన పొగ పట్టణశివారు ప్రాంతమంత వ్యాపించింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.