రాజేంద్రనగర్: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై భార్య ఫిర్యాదు, కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు
అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఓ భర్తపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల తెలిపిన వివరాలు.. మొయినాబాద్ మండలం పెద్దమంగళారానికి చెందిన సందీప్ 2018లో శంషాబాద్కు చెందిన ఓ యువతిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధిస్తున్నాడు. ఆ వేధింపులను భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించగా భర్తపై కేసు నమోదైంది