ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : నిడిగొండ గ్రామం వద్ద మోటార్ సైకిల్ దొంగను పట్టుకున్న పోలీసులు
రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ద్విచక్ర వాహన దొంగ ఇరుగదిండ్ల భాస్కర్ అనే వ్యక్తిని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎస్ఐ నరేష్ అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన వెలిశాల ఉప్పలయ్య తన వ్యవసాయ భావి వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించినట్లు గురువారం పోలీసుల కు ఫిర్యాదు చేశారు. నిడిగొండ గ్రామ శివారులో వాహనాలను శుక్రవారం పోలీసులు తనిఖీ చేస్తున్న క్రమంలో దొంగిలించబడిన మోటార్ సైకిల్ ను భాస్కర్ ఒక్కసారి గా వెనక్కు తిప్పగా అనుమానం వచ్చి ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు.