ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మేకలవారిపల్లి టోల్ ప్లాజా వద్ద ఎం ఎస్ ఎం ఇండస్ట్రియల్ పార్కును ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 50 ఎకరాల స్థలాన్ని పూర్తిగా చదును చేయాలన్నారు. కొలతల్లో తేడా లేకుండా చూడాలన్నారు. పనులలో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.