మేడిపల్లి: చెంగిచర్లలో హిందూ మహిళలపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ధర్నా చేపట్టిన బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు
చెంగిచర్లలో ఇటీవల హిందువులపై దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు మంగళవారం ఆందోళన చేపట్టారు. దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.