అవుకు మండలంలో ప్రారంభమైన వరి కోతలు..
నంద్యాల జిల్లా అవుకు మండలం తిమ్మరాజు రిజర్వాయర్, ఎస్సార్ బీసీ కాలువ కింద సాగు చేసిన వరి పంట సకాలంలో చేతికందడంతో రైతులు కోతలకు శ్రీకారం చుట్టారు. అధిక వర్షాలు ఉన్నా, దిగుబడి ఎకరాకు 35 నుంచి 40 బస్తాల మేర ఆశాజనకంగా ఉందని రైతులు తెలిపారు. కూలీల కొరత కారణంగా చాలావరకు వరి కోత యంత్రాలనే ఉపయోగిస్తున్నారు.