ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : గబ్బెట గ్రామంలో ట్రాక్టర్ యూనియన్ కమిటీ ఎన్నిక
రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామం ట్రాక్టర్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది.. ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా ఎండి రంజాన్ ఉపాధ్యక్షుడిగా పుట్టల బాబు, కార్యదర్శిగా పులి రామాంజనేయులు, సహాయ కార్యదర్శిగా అంజయ్య ఎన్నికయ్యారు. గౌరవ సభ్యులుగా చిట్యాల యాదయ్య, గొడిశాల సుధాకర్, వెంకటాచలం, జనార్దన్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రంజాన్ మాట్లాడుతూ ట్రాక్టర్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం తో పాటు వారికి అండగా నిలువనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.