BRS నేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీలో ఉన్న కాలుష్యం కంటే BRS నేతల కడుపుల్లోనే ఎక్కువ విషం ఉందని మండిపడ్డారు. వాళ్ల కళ్లకు గనుక ఏదైనా శక్తి ఉండి ఎవరి వైపు అయినా చూస్తే కాలి బూడిదవుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదేపదే అడ్డు తగలడం మంచిది కాదన్నారు. క్వశ్చన్ అవర్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ రెండే ఉంటాయని, పది క్వశ్చన్స్ ఉండవని, పది మందికి అవకాశం ఉండదని చెప్పుకొచ్చారు.