భూపాలపల్లి: జిల్లా ప్రజలందరూ స్వచ్ఛత పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో బుధవారం ఉదయం 11:30 గంటలకు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతపై అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు కలెక్టర్ రాహుల్ శర్మ .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలందరూ విధిగా స్వచ్ఛత పాటిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, రావు ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.