రాయికోడ్: రాయికోడు మండలంలో రోడ్డుపై వరద ప్రవాహం ఆ గ్రామానికి రాకపోకల ఇబ్బంది
సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం లోని రాయికోడు మండలం యూసుఫ్ పూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సోమవారం తెల్లవారుజామున రోడ్డుపై ఏకధాటిగా వరద ప్రభావం కొనసాగుతుందని ఆ గ్రామం నుండి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామస్తులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించి వంతెనను మరమ్మత్తులు చేసి నూతన వంతెన ఏర్పాటు చేయాలని కోరారు.