మేడిపల్లి: గ్రామ పంచాయతీ మిగులు పనులకు రూ.10 లక్షల నిధులు మంజూరు
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి గ్రామంలోని మిగిలిపోయినా గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనుల కోసం రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తూ అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.కాగా మిగిలిపోయిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మేడిపల్లి గ్రామ ప్రజలు,కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.