రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. మంగళవారం తెల్లవారుజామున అభిషేకాలు ప్రత్యేక పూజలు అనంతరం వివిధ రకాల పుష్పాలతో విశేష అలంకరణ చేయనున్నారు. ఉత్సవ మూర్తులను పల్లకిలో శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలకు తీసుకెళ్లి అనంతరం ప్రజలతోపాటు ఆలయానికి తీసుకువస్తారు. ఉదయం 5.30 నుంచే భక్తులకు వైకుంఠం ద్వారా దర్శనం కల్పించనున్నట్లు ఆలయ చైర్మన్ గాజుల వెంకటేశులు, ఈఓ నరసింహరెడ్డి, అర్చకులు బాలమురళీ కృష్ణ బట్టార్ తెలియజేశారు. వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు.