రైలు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు - నంద్యాల - మార్కాపురం మధ్య పగటి పూట రైలుకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఎంపీ డా.బైరెడ్డి శబరి మంగళవారంతెలిపారు. ఇటీవల పార్లమెంట్లో ఆమె చేసిన విన్నపానికి స్పందిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ రైలు సౌకర్యాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రైలు (57407/08) త్వరలోనే పట్టాలెక్కనుంది.