పాకాల మండలం పెద్ద గోరుపాడు లో దొంగతనం
చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పెద్ద గోర్పాడు లోని రంగనాయకమ్మ ఇంటిలో చోరీ జరిగింది మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్నా ఆమె అల్లుడు ఇంటికి వెళ్ళింది సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించింది ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా 24 గ్రాముల రెండు జతల కమ్మలు 5000 రూపాయల నగదు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.