చిత్తూరు నగరంలోని దర్గా సర్కిల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మేయర్ అమ్ముదా చుడా చైర్మన్ కటారి హేమలత, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మొన్న యుగంధర్ తో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తామని బడుగు బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వస్తే ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం బ