మంత్రాలయం: మంత్రాలయం ఎంపీడీవో నూర్జహాన్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశంlo పాల్గొన్న ప్రజాప్రతినిధులు ,అధికారులు
మంత్రాలయం: మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో నూర్జహాన్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు. వీటిపై ప్రజా ప్రతినిధులు పంచాయతీలలో సిసి రోడ్లు, త్రాగునీటి సమస్యలను లేవనెత్తి అధికారుల ను నిలదీశారు. ఎంపీపీ గిరిజమ్మ మాట్లాడుతూ అధికారులు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.