చిత్తూరు: 'చలో కలెక్టరేట్ విజయవంతం చేయాలి' మామిడి రైతులు ఈనెల 22న తలపెట్టిన 'చలో చిత్తూరు కలెక్టరేట్'ను జయప్రదం చేయాలని మామిడి రైతు సంఘం నేతలు కోరారు. చిత్తూరు నగరంలోని STU కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. పల్ప్ ఫ్యాక్టరీలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు కిలోకు రూ.8 ఇవ్వాల్సి ఉందన్నారు. ఆరు నెలల అనంతరం రూ. 4 మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఇది దారుణమని, బకాయిల కోసం చలో కలెక్టరేట్ చేపడుతున్నామన్నారు.