పలమనేరు: తిరువన్నామలై దీపం తరహాలో, అంగరంగ వైభవంగా గంటావూరు గంగమ్మ ఆలయంలో కృత్తిక దీపం, భారీగా హాజరైన ప్రజలు
పలమనేరు: గంటావూరు బీసీ కాలనీలో శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ ధర్మకర్త మరియు చైర్మన్ మురుగ మాట్లాడుతూ,ఆదేవదేవుడు కొలువై ఉన్న తిరువన్నామలై నందు దీపం వెలిగించే రీతిలో గంటావూరు గంగమ్మ గుడి నందు కృత్తిక దీపం వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతినెల పౌర్ణమి రోజు జరిపేందుకు కృషి చేస్తామన్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ, గంగమ్మ ఆలయం నందు ఎంతో వైభవోపేతంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు జరిపి కృత్తికా దీపం వెలిగించి గంగమ్మకు ఉంజల్ సేవను నిర్వహించడం జరిగిందన్నారు. ఎంతోమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. విచ్చేసిన భక్తాదులకు ఆలయ చైర్మన్ అన్నదాన కార్యక్రమం విరివిగా జరిపారన్నారు.