ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు పాస్టర్లకు 12 నెలల వేతనం ఒక్కసారిగా 60 వేల రూపాయలు అకౌంట్ కు జమ చేసినందున టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి పాస్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.