ఫరూక్ నగర్: ఫరూఖ్ నగర్ మండలంలో కుక్కల దాడిలో మేకలు మృతి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో గున్న మల్లయ్య కు చెందిన మేకల మందపై కుక్కల గుంపు విరుచుకుపడ్డాయి. మందలో ఉన్న 15 మేకలపై దాడి చేయగా ఈ ఘటనలో మేకలు మృతి చెందాయి. మృతి చెందిన మేకల విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.