పెద్దపల్లి: హైదరాబాద్ నుంచి భారత్ గౌరవ ట్రైన్ యాత్ర సమ్మర్ స్పెషల్ ప్యాకేజ్ : జనరల్ మేనేజర్ టూరిజం డి.ఎస్.జి.పి కిషోర్
హైదరాబాద్ నుంచి భారత్ గౌరవ ట్రైన్ యాత్ర సమ్మర్ స్పెషల్ ప్యాకేజ్ అందుబాటులో ఉన్నాయని పెద్దపెల్లి జిల్లా ప్రజల వినియోగించుకోవాలని జనరల్ మేనేజర్ టూరిజం డి.ఎస్.జి.పి కిషోర్ గురువారం సాయంత్రం తెలిపారు. భారత రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ ద్వారా భారత గౌరవ టూర్ పేరుతో ప్రత్యేకంగా దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను హైదరాబాద్ నుంచి పర్యటనకు ప్యాకేజీలు తయారు చేసిందని, వీటిలో ట్రైన్ జర్నీ బస్ జర్నీ హోటల్ భోజన ఖర్చులు, గైడ్ తో సహా సైట్ సీయింగ్ ఉంటాయని అన్నారు.భారత గౌరవ టూర్ లో భాగంగా హైదరాబాద్ నుంచి ఐదు ప్యాకేజీ లలో ప్రత్యేక ట్రైన్లు ఉన్నాయని తెలిపారు.