నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల ఎక్సైజ్ సీఐ కృష్ణమూర్తి, ఈఎస్ టీఎఫ్ సీఐ ఎం. లక్ష్మణ్ దాస్ హెచ్చరించారు. బండిఆత్మకూరు మండలం నెమళ్లకుంటలో ఈఎస్ రవికుమార్ ఆదేశాల మేరకు బుధవారం దాడులు నిర్వహించారు. HC బత్తుల నాగరాజు, సిబ్బందితో కలిసి బట్టీలను ధ్వంసం చేశారు. గ్రామస్థులతో నవోదయం 2.0 పై అవగాహన కల్పించారు. నాటుసారా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.