బుగ్గారం: ధర్మపురి: పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి ఈశ్వర్
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం సాయంత్రం 4 గంటలకు పర్యటించారు. మండలంలోని గోపులాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కొమ్మినేని నారాయణ రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బుగ్గారం మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మూల శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారని విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఈశ్వర్.. శ్రీనివాస్ ను పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి వెంట డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ రాజేష్ కుమార్ తోపాటు స్థానిక నాయకులు ఉన్నారు