సంతనూతలపాడు నియోజకవర్గ భారత చైతన్య యువజన పార్టీ (BCY) కన్వీనర్ గా చీమకుర్తి పట్టణానికి చెందిన తోకల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నట్లు వెంకటరమణ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంతనూతలపాడు నియోజకవర్గంలో గ్రామస్థాయి నుండి బీసీవై పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యువతను పెద్ద ఎత్తున ఆకర్షించి, బిసివై పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని వెంకటరమణ తెలిపారు.