కాగజ్నగర్: సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు
సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు బుధవారం పరిశీలించారు.రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి మరియు లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం కొత్తగా నిర్మించిన స్టేషన్ మాస్టర్ భవనం, ప్లాట్ ఫాం ఇతర మౌలిక సదుపాయాల గురించి రైల్వే అధికారులతో చర్చించారు.మార్కెట్ వైపు ఉన్న రైల్వే బౌండరీ వాల్ ను తొలగించాలని తద్వారా మార్కెట్ నుండి రైల్వే స్టేషన్ కు వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులకు సూచించారు.