పట్నంలో రోడ్డున పడ్డ ఆందోళనకారులు,అర్ధరాత్రి నిరాహారదీక్ష శిబిరం టెంట్లు పీకేసి పట్టుకుపోయిన రెవెన్యూ,మున్సిపల్ సిబ్బంది
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట 61 రోజులుగా నిరాహర దీక్ష కొనసాగిస్తున్న జీ కోడూరు దళితుల ఆందోళన రోడ్డున పడింది. ఆదివారం రాత్రి మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న వీరి టెంట్ ను పీకేసి పట్టుకొని పోయారు దాంతో సోమవారం నడిరోడ్డుపై కూర్చొని 62వ రోజు ఆందోళన చేపట్టారు.