కోడూరు: నూతన సచివాలయంలో - వర్షపు నీరు
కోడూరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం దగ్గర నూతనంగా నిర్మించిన సచివాలయం - 4 భవనంలో వర్షం కురిసిన ప్రతిసారి స్లాబ్ నుంచి నీరు కారుతుంది. ఈ కారణంగా సచివాలయంలో కూర్చున్న ప్రజలు జారిపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని స్థానికులు తెలియజేస్తున్నారు.