ఒంగోలు: బ్రాహ్మణుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది, నగరంలో బ్రాహ్మణ రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు,
బ్రాహ్మణ రాష్ట్ర సాధికార కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని లాయర్ పేట శ్రీ గురుదత్త టవర్స్ నందు రాష్ట్ర సాధికారిక కమిటీ సభ్యులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోని జరిగిందని తెలిపారు, అలాగే రానున్న ఎన్నికల సంగ్రామంలో టిడిపి అధినేత చంద్రబాబు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, భారీ మెజార్టీతో జన విజయం సాధించిన తర్వాత వారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు, అలాగే త్వరలో బ్రాహ్మణ రాష్ట్ర సాధికార కమిటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సదస్సు భారీ ఎత్తున జరుపుతామని తెలిపారు,