మాచర్ల మండలం జమ్మలమడకకు చెందిన అమర లింగేశ్వరరావు మాలి దేశంలో డీజిల్ మెకానిక్గాగా పనిచేస్తున్నాడు. జులై 1న అతడిని అక్కడి ఆల్ ఖైదా అనుబంధ సంస్థ కిడ్నాప్ చేసింది. ఈ వార్త తెలిసిన తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మీలు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డను క్షేమంగా విడుదల చేయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం మీడియా ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు.