రెబ్బెన: ఖైర్గూడ ఓపెన్ కాస్ట్ ని సందర్శించిన బెల్లంపల్లి ఏరియా GM ఎం.శ్రీనివాస్
రెబ్బన మండలంలోని ఖైర్గూడ ఓపెన్ కాస్ట్ ని సోమవారం బెల్లంపల్లి ఏరియా GM ఎం.శ్రీనివాస్ సందర్శించారు.ఈ సందర్బంగా ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో ఉత్పత్తి వివరాల రిజిస్టర్లను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. వెస్ట్ వ్యూ పాయింట్ నుండి ఖైర్గూడ ఓపెన్ కాస్ట్ పని స్థలాలు వీక్షించారు. అనంతరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి అధికారులతో,సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలపై గని అధికారులకు,సిబ్బందికి మార్గ నిర్దేశం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున పనులు వేగవంతం చేయాలని సూచించారు.