రాజేంద్రనగర్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ను పరిధిలో వ్యక్తి దారుణ హత్య, సుత్తితో తలపై మోది హత్య చేసిన దుండగులు
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేగింది. నాగులపల్లి ప్రాంతంలో ఓ వ్యక్తిని తలపై సుత్తితో మోది హత్య చేశారు. మృతుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజేష్ కుమార్ గా గచ్చిబౌలి పోలీసు అధికారులు గుర్తించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. జరిగిన ప్రమాద ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.